Congress: అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తా: రేణుకా చౌదరి

అవసరమైతే  ఏపీ (AP), తెలంగాణ (Telangana) నుంచి కూడా పోటీ చేస్తానని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామన్నారు

Updated : 25 Mar 2023 14:20 IST

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే (Manikrao Thakre) ఆహ్వానం మేరకే ఆయన్ను కలిశానని  కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) అన్నారు. ఠాక్రేతోపాటు తాను కూడా హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ యాత్రలో పాల్గొంటానని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాకు ఆహ్వానిస్తామని చెప్పారు. పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామన్నారు. ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పిన ఆమె.. పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తానని తెలిపారు. ఏపీలోని గుడివాడ నుంచి కూడా పోటీ చేయాలంటూ కొందరు ఆహ్వానిస్తున్నారని, అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తానని రేణుకా చౌదరి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు