AIADMK: మళ్లీ ఎన్డీయేలో చేరం.. అన్నామలైని తొలగించాలని మేం కోరం: అన్నాడీఎంకే
తమిళనాడులో భాజపాతో కటీఫ్ చెప్పిన అన్నాడీఎంకే కొత్త కూటమి ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
చెన్నై: తమిళనాడు(Tamil Nadu)లో భాజపాకు కటీఫ్ చెప్పి ఎన్డీయే నుంచి వైదొలగిన అన్నాడీఎంకే(AIADMK) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. భాజపాతో నాలుగేళ్ల బంధానికి గుడ్‌బై చెప్పిన మూడు రోజుల అనంతరం ఈ నిర్ణయం ప్రకటించింది. తమ పార్టీ నిర్ణయాన్ని సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ డ్రామాగా పేర్కొంటున్నారని.. మళ్లీ తాము భాజపాతో పొత్తు పెట్టుకొనే అవకాశమే లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కేపీ మునుస్వామి అన్నారు. కృష్ణగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైని తొలగించాలని తాము కోరడంలేదన్నారు. అన్నాడీఎంకే లాంటి పెద్ద పార్టీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరడం చిన్నతనం అవుతుందన్నారు. తాము అలాంటి తప్పు ఎప్పుడూ చేయబోమని పేర్కొన్నారు. మరో పార్టీ ఎలా పనిచేయాలో చెప్పేంత సంస్కారహీనులం కాదన్న ఆయన.. అన్నాడీఎంకే అలాంటి పార్టీ కాదన్నారు. మళ్లీ ఎన్డీయేలో చేరతారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నలకు మునుస్వామి స్పందించారు. ‘‘స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇదంతా డ్రామా అని విమర్శిస్తున్నారు. భాజపాతో బంధం తెంచుకున్నామన్న భయంతోనే వారు అలా మాట్లాడుతున్నారు’’ అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మేం ఎన్డీయేలో చేరం.. కానీ ఎడప్పాడి పళనిస్వామి సారథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తాం’’ అని బదులిచ్చారు. తమిళనాడులో
భాజపా సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) నుంచి సోమవారం అన్నాడీఎంకే వైదొలగిన విషయం తెలిసిందే. భాజపా రాష్ట్ర నాయకత్వ వైఖరి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైతో అన్నాడీఎంకేకు వైరం కొనసాగుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైతోపాటు జయలలితపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అన్నాడీఎంకే తీవ్ర ఆవేదనకు గురిచేయడం, తదితర కారణాల నేపథ్యంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు దిగని జగన్.. పొలం గట్టున బాబు
తుపానుకు దెబ్బతిన్న పంటల పరిశీలన సందర్భమది.. శుక్రవారం పట్టపగలు సీఎం వైఎస్ జగన్ వచ్చారు. చుట్టూ బారికేడ్లు, పొలం పక్కనున్న రోడ్డు మీద ఎత్తయిన వేదిక.. ఎండ పడకుండా టెంట్లు.. కనీసం రోడ్డు దిగకుండా అక్కడి నుంచే ‘పంట నష్టాన్ని’ పరిశీలించి వెళ్లారు. అదే ప్రాంతానికి అదేరోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు చేరుకున్నారు. -
నేటి నుంచి లోకేశ్ పాదయాత్ర పునఃప్రారంభం
తుపాను కారణంగా తాత్కాలికంగా ఆగిన యువగళం పాదయాత్ర శనివారం మళ్లీ ప్రారంభం కానుంది. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ఈ యాత్ర ఈ నెల 3న కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం శీలంవారిపాకల ప్రాంతం వద్దకు చేరుకుంది. -
ప్రభుత్వ ఉదాసీనతతో అన్నదాతకు తీవ్రనష్టం
తుపానుపై వైకాపా ప్రభుత్వ ఉదాసీనత వల్లే అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల, ఉంగుటూరు మండలం కైకరం, తల్లాపురం గ్రామాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. -
సమన్వయంతో పని చేస్తే అధికారంలోకి..
తెదేపాతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయాల్సిన సమయమిదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో చెప్పారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
మూడు నెలల్లో ఫలితం అనుభవిస్తారు
ప్రజాసమస్యల్ని గాలికొదిలేసి, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ విర్రవీగితే... ఫలితం అనుభవించక తప్పదని జగన్ ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఓటేశాం. -
భయస్థులకు ఎన్నికల్లో పోటీ ఎందుకు?
భయం భయంగా బతుకుతున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడం అవసరమా.. అని సీఎం జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ప్రజలకు కనపడని వ్యక్తి ముఖ్యమంత్రిగా అవసరమా.. అని నిలదీశారు. -
ఎన్నికలకు ముందు గ్రూప్-2 ప్రకటన
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగుల్ని వంచించడమేనని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు
తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాకు గట్టి షాక్ తగిలింది. డబ్బు, ఖరీదైన బహుమతులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణల వ్యవహారంలో ఆమెపై లోక్‌సభ శుక్రవారం బహిష్కరణ వేటు వేసింది. -
తిరుపతికి ‘బ్యాండ్’ వేశారు!
తిరుపతిలో టీడీఆర్ బాండ్ల రూపంలో భారీ కుంభకోణం జరిగిందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈసీలు ఉంటే భూమి ఎవరికి ఎలా వచ్చిందనే వివరాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈసీలు లేకుండానే బాండ్లను జారీ చేశారని ఆరోపించారు. -
మిజోరం సీఎంగా లాల్దుహోమా ప్రమాణం
మిజోరంశాసనసభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ (జెడ్పీఎం) అధ్యక్షుడు లాల్దుహోమా శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ఓటమి అనూహ్యం: కాంగ్రెస్
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా చేతిలో ఓటమి అనూహ్యమని, ఆ ఫలితాలు తమను తీవ్రంగా నిరాశపరిచాయని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. -
‘మేడిగడ్డ’ అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
మేడిగడ్డ ప్రాజెక్టులో అక్రమాలపై న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. -
కాంగ్రెస్ గ్యారంటీల అమలుకు పోరాడతాం
అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 8 స్థానాలు, 14 శాతం ఓట్లతో పాటు 19 స్థానాల్లో ద్వితీయ స్థానంలో నిలిచిందని, ప్రతిపక్ష పార్టీగా బాధ్యతను నెరవేరుస్తుందని మధ్యప్రదేశ్ పార్టీ ఇన్‌ఛార్జి పి.మురళీధర్‌రావు తెలిపారు. -
మధ్యప్రదేశ్ భాజపా శాసనసభాపక్ష నేత ఎంపిక పరిశీలకునిగా డాక్టర్ లక్ష్మణ్
మధ్యప్రదేశ్ భాజపా శాసనసభాపక్ష నేత ఎంపికకు పరిశీలకునిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నియమితులయ్యారు. -
ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువు తీరింది
రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువు తీరిందని, ప్రగతిభవన్ ముందు కంచెలు తొలగించి ప్రజాభవన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. -
నేడు గాంధీభవన్‌లో సోనియా జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను డిసెంబరు 9న శనివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించనుంది. -
ప్రొటెం స్పీకర్ ఎదుట భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయరు
ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎదుట భాజపా ఎమ్మెల్యేలెవరూ ప్రమాణ స్వీకారం చేయబోరని.. అసెంబ్లీలో పూర్తిస్థాయి స్పీకర్ నియమితులైన తర్వాతే చేస్తారని ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ తెలిపారు. -
భారాస శాసనసభా పక్ష నేతగా కేసీఆర్!
భారాస శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలిసింది. -
3నెలల తరవాత నేనే పరిహారం ఇస్తా
మిగ్జాం తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉంటే బాధ్యతలేని ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యతారహితంగా వ్యవహరించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. -
ధైర్యంగా ఉండండి.. మీ కోసం పోరాడతా
మిగ్జాం తుపాను ప్రభావిత ప్రాంతాలైన గుంటూరు, బాపట్ల జిల్లాల్లో రైతులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వడానికి తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం పర్యటించారు. ఉండవల్లి నుంచి తెనాలి వెళుతుండగా మార్గమధ్యలో రేవేంద్రపాడు వద్ద రైతులు ఉరితాళ్లు మెడకు తగిలించుకుని దెబ్బతిన్న పంటలను చేతబట్టుకుని వినూత్న నిరసన చేస్తూ కనిపించారు.


తాజా వార్తలు (Latest News)
-
డోరు తెరుచుకున్నా పైకి రాని లిఫ్ట్.. నాలుగో అంతస్తు నుంచి పడి కొరియర్ బాయ్ మృతి
-
ముఖంపై పేడ వేసిన గేదె ఊపిరాడక చిన్నారి మృతి
-
సివిల్స్ ఇంటర్వ్యూలకు 90 మంది తెలుగు అభ్యర్థులు!
-
భారాస శాసనసభా పక్ష నేతగా కేసీఆర్!
-
చిల్లర ఖర్చుల కోసం దారుణ హత్యలు
-
Renu Desai: అంకుల్ మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది.. రేణూ దేశాయ్ వ్యంగ్యాస్త్రాలు