Babul Supriyo: ‘ఎంపీ పదవిలో కొనసాగుతా’..  నిర్ణయం మార్చుకున్న బాబుల్‌ సుప్రియో

రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడంతో పాటు ఎంపీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్టు  ఇటీవల సంచలన ప్రకటన చేసిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో పునరాలోచనలో.....

Published : 03 Aug 2021 01:13 IST

కోల్‌కతా: రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడంతో పాటు ఎంపీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్టు ఇటీవల సంచలన ప్రకటన చేసిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో తన నిర్ణయం మార్చుకున్నారు. ఎంపీ పదవిలో కొనసాగుతానని సోమవారం ఆయన స్పష్టంచేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అనంతరం బాబుల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండబోనన్న ఆయన.. రాజ్యాంగపరమైన బాధ్యతను మాత్రం నిర్వర్తిస్తానని తెలిపారు. తాను ఏ పార్టీలోనూ చేరనని తేల్చి చెప్పారు. దిల్లీలో ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తానని, భద్రతా సిబ్బందిని కూడా వెనక్కి ఇచ్చేయనున్నట్లు చెప్పారు.

బాబుల్‌ సుప్రియో పశ్చిమబెంగాల్‌లోని అసన్సోల్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 2014 నుంచి కేంద్రంలో వివిధ మంత్రిత్వశాఖలకు సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన.. గత నెలలో మోదీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో మంత్రి పదవిని కోల్పోయారు. దీంతో అప్పట్నుంచి నిరుత్సాహంతో ఉంటూ వచ్చిన బాబుల్‌.. శనివారం తన ఫేస్‌బుక్‌ పేజీలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని