నా జర్నీ ఇప్పుడే మొదలైంది..: సిద్ధూ 

తనను పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా నియమించిన పార్టీ అధిష్ఠానానికి మాజీ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. .........

Published : 19 Jul 2021 18:39 IST

చండీగఢ్‌: తనను పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా నియమించిన పార్టీ అధిష్ఠానానికి మాజీ మంత్రి నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఆదివారం రాత్రి ఆయన్ను పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ సారథిగా నియమిస్తూ సోనియా గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై హర్షం వ్యక్తంచేస్తూ సిద్ధూ ట్వీట్‌ చేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ కోటను మరింత బలోపేతం చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. పంజాబ్‌లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కుటుంబానికి చెందిన ప్రతిఒక్క సభ్యుడితోనూ కలిసి వినయపూర్వకంగా పనిచేస్తానన్నారు. పంజాబ్‌ మోడల్‌, హైకమాండ్‌ 18 పాయింట్ల అజెండా ద్వారా అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. అని ట్విటర్‌లో సిద్ధూ పేర్కొన్నారు. మరోవైపు, సిద్ధూను పీసీసీ చీఫ్‌గా నియమించడంతో పాటు మరో నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను కూడా కాంగ్రెస్‌ నియమించిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts