Mamata Banerjee: కర్ణాటక ఎన్నికల్లో అలా జరిగితే సంతోషిస్తా: మమత

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnatak Elections 2023) ఆ రాష్ట్ర ప్రజలు భాజపాకు కాకుండా ఇతర పార్టీలకు ఓటు వేయాలని పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అక్కడి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

Published : 05 May 2023 00:10 IST

కోల్‌కతా: కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections 2023) భాజపా పతనం ప్రారంభమైతే సంతోషిస్తానని పశ్చిమ బెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) పార్టీ మాల్దాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న దీదీ.. భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. భాజపా తన స్వప్రయోజనాల కోసం హిందూ మతాన్ని కించపరుస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ‘‘భాజపా ఎంత త్వరగా అధికారం కోల్పోతే.. దేశానికి అంత త్వరగా మంచి జరుగుతుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు కాకుండా ఇతర పార్టీలకు ఓటు వేయండి. కర్ణాటక ఎన్నికలతో భాజపా పతనం ప్రారంభమైతే సంతోషిస్తా. హిందూత్వంలోని పవిత్రతను భాజపా నాశనం చేస్తోంది’’ అని మమతా బెనర్జీ విమర్శించారు. 

దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లపై అర్ధరాత్రి దిల్లీ పోలీసులు దాడి చేయడాన్ని మమతా బెనర్జీ ఖండించారు. రెజ్లర్లపైకి ఎంత మంది కేంద్ర బలగాలను పంపారనేది కేంద్రం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. వారి ఆందోళనపై ఇప్పటికైనా భాజపా తన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో తిరిగి శాంతిని నెలకొల్పే బాధ్యత ప్రధాని మోదీ, అమిత్‌ షాదేనన్నారు. మణిపూర్‌ ప్రజలు సంయమనం పాటిస్తూ.. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు సహరించాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని