Published : 06 Jul 2022 14:38 IST

Yanamala: దోచుకున్న ప్రతి రూపాయీ ప్రజలు కక్కిస్తారు: యనమల

అమరావతి: అవార్డుల పేరుతో వాలంటీర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.485.44 కోట్లు దోచిపెడుతోందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఇప్పటికే ప్రకటనల ద్వారా సొంత పత్రిక సాక్షికి ఈ మూడేళ్లలో రూ.280కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేశారని ఆక్షేపించారు. ఈ మేరకు సీఎం జగన్‌పై పలు విమర్శలు చేశారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘ఇప్పుడు వాలంటీర్లకు వార్తాపత్రికల కోసమంటూ చెల్లింపులు మొదలు పెట్టారు. నెలకు రూ.200 చొప్పున చెల్లించేందుకు జీవో జారీ చేశారు. ఈ లెక్కన మొత్తం రూ.5.50కోట్లు ఖర్చవుతుంది. సొంత పత్రిక ‘సాక్షి’ కొనుగోలు చేసేలా ఆ డబ్బును సొంత ఖజానాకు లాక్కుంటున్నారు. సీఎం జగన్‌ తన సొంత పత్రికను వైకాపా కార్యకర్తలకు ఉచితంగా ఇవ్వలేరా? దోచుకున్న ప్రతి రూపాయీ కక్కించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని యనమల వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని