సుప్రీం వ్యాఖ్యలే అందుకు నిదర్శనం: యనమల

పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు అనుమతించడాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు. ఎన్నికల కమిషన్‌ పట్ల ముఖ్యమంత్రి అహంభావంతో వ్యవహరించారనడానికి సుప్రీంకోర్టు...

Updated : 25 Jan 2021 16:56 IST

అమరావతి: పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు అనుమతించడాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు. ఎన్నికల కమిషన్‌ పట్ల ముఖ్యమంత్రి అహంభావంతో వ్యవహరించారనడానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలే అందుకు నిదర్శమన్నారు. చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదో ఒక వంకతో ఎన్నికలను ఆపాలని చూడడం, ఉద్యోగ సంఘాలు వత్తాసు పలకడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందని చెప్పారు. ఇప్పటికైనా ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని యనమల రామకృష్ణుడు సూచించారు. నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఇవీ చదవండి..

కేంద్రహోంశాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ
వీడియో: ఏపీ ఓటరు జాబితాలో మీ పేరు ఇలా చూడొచ్చు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని