ఇదేనా జగన్‌ గ్రామస్వరాజ్యం?: యనమల

గ్రామ స్వరాజ్యంపై జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెదేపా సీనియర్‌నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు....

Published : 16 Aug 2020 12:31 IST

అమరావతి: గ్రామ స్వరాజ్యంపై జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెదేపా సీనియర్‌నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘గ్రామ వాలంటీర్లుగా సొంతపార్టీ వాళ్లను నియమించడం గ్రామ స్వరాజ్యమా? కరోనా నిధులు రూ.8వేల కోట్లు మళ్లించడం గ్రామ స్వరాజ్యమా?నరేగా నిధులు సొంత పార్టీ వారికి పంచడం గ్రామస్వరాజ్యమా? 73, 74 రాజ్యాంగ సవరణలు ఎందుకు అమలు చేయడం లేదు? మేం చేసిన దాంట్లో మూడోవంతు నిధులు కూడా గ్రామీణాభివృద్ధికి ఖర్చు చేయలేదు. 14 నెలల పాలనలో ప్రజల స్వేచ్ఛను హరించారు. 600కు పైగా పోస్టులు సొంత సామాజిక వర్గానికే కేటాయించారు. నామినేటెడ్‌ పోస్టుల్లో తమవాళ్ల నియామకమే సామాజిక న్యాయమా?’’ అని యనమల   ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని