వైకాపా అప్పులు..రైతులకు తిప్పలు: యనమల

వైకాపా ఉచిత విద్యుత్‌ రైతులకు ఇచ్చే రాయితీ కాదని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....

Published : 06 Sep 2020 10:56 IST

అమరావతి: వైకాపా ఉచిత విద్యుత్‌ రైతులకు ఇచ్చే రాయితీ కాదని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...మీ అప్పుల తిప్పల కోసం రైతుల ప్రాణాలకు ముప్పు తెస్తారా? అని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్నదాతలకు ఇచ్చేది విద్యుత్‌ రాయితీ కాదన్న యనమల.. కార్పొరేషన్‌ కంపెనీలకు ఇచ్చేది రాయితీ ఎలా అవుతుందన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే డిస్కమ్‌లకు రూ.4,802 కోట్లు ఎగ్గొట్టిందని విమర్శించారు. ఈ లెక్కన ఐదేళ్లలో డిస్కమ్‌లకు రూ.24వేల కోట్ల నష్టం వచ్చే అవకాశముందన్నారు. ఆ భారం పడేది రాబోయే ప్రభుత్వంపై కాదా? అని ప్రశ్నించారు. సుద్దులు చెప్పే మీరు తొలి ఏడాదే డిస్కమ్‌లకు ఎందుకు ఎగ్గొట్టారని నిలదీశారు.

‘‘సొంత మీడియాకే సగం ప్రభుత్వ ప్రకటనలు ఇస్తారా? కేంద్రం కేటాయింపులకన్నా రెట్టింపు నీటిని సీఎం సొంత కంపెనీకి కేటాయిస్తారా?. మీ కంపెనీ పరిధిలో 25 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నా లేవంటూ...కేంద్రానికి తప్పుడు సమాచారం పంపిస్తారా?. రూ.1300 కోట్ల విలువైన సున్నపురాయి గనుల లీజులు జీవితకాలం పొడిగిస్తారా? సొంత కంపెనీకి రెట్టింపు నీళ్లు కేటాయించుకున్న సీఎం గతంలో ఉన్నారా?’’ అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని