YCP MLA: త్వరలో తెదేపాలో చేరతా.. వైకాపా ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వినాయకుడి ఆశీస్సులతో తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బయటకు వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Updated : 19 Sep 2023 13:15 IST

కడప: వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వినాయకుడి ఆశీస్సులతో తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బయటకు వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబుకు, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైకాపా నన్ను సస్పెండ్‌ చేసింది. త్వరలోనే తెదేపాలో చేరతా. చంద్రబాబు అరెస్టు కాకుండా ఉంటే ఇప్పటికే పార్టీలో చేరేవాడిని. చేరికపై జవాబు వచ్చాక పార్టీలో అధికారికంగా చేరతా’’ అన్నారు. 

‘‘నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా నా గ్రాఫ్‌ బాగాలేదని సీఎం చెప్పారు. నేను తప్ప ఉదయగిరిలో ఏవరూ గెలవలేరు. చంద్రబాబు టికెట్‌ ఇస్తే మరోసారి గెలుస్తా. టికెట్‌ ఇవ్వకపోయినా తెదేపాలోనే కొనసాగుతా. రాష్ట్రంలో ధర్మం, న్యాయం లేదని ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే న్యాయం, ధర్మం జరుగుతుంది’’ అని మేకపాటి వ్యాఖ్యానించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు