ఎంపీ రఘురామ, టీవీ5 ఛైర్మన్‌పై ప్రధానికి వైకాపా ఫిర్యాదు

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ 5 ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుపై వైకాపా ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు.....

Published : 27 Jul 2021 01:44 IST

దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ 5 ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుపై వైకాపా ఎంపీలు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. వారిద్దరి మధ్య హవాలా లావాదేవీలు జరిగినట్టు విజయసాయిరెడ్డి నేతృత్వంలో 15మంది ఎంపీల బృందం ఫిర్యాదులో పేర్కొంది. మిలియన్‌ యూరోలు బదిలీ జరిగినట్టు వైకాపా ఎంపీలు ఆరోపించారు. మనీలాండరింగ్‌, ఫెమా చట్టాల కింద విచారణ జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

అలాగే, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా వైకాపా ఎంపీలు కలిశారు. పోలవరం, ప్రత్యేక హోదాపై వెంటనే జోక్యం చేసుకోవాలని ఆమెను కోరారు. పోలవరం తుది డీపీఆర్‌కు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. 2017-18 ధరల ప్రకారం భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి కలిపి రూ.55,656.87 కోట్లకు సీడబ్ల్యూసీ, టీఏసీలు ఆమోదం తెలిపాయని వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని