Yogi Adityanath: సీఎంగా యోగి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణస్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. .....

Published : 19 Mar 2022 01:27 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే శుక్రవారం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు భాజపా వెల్లడించింది. ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు యోగి వరుసగా రెండోసారి యూపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం లఖ్‌నవూలోని ఎకానా స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు సమాచారం. కొత్త మంత్రివర్గంలో 20 మందికి పైగా కేబినెట్‌ హోదా మంత్రులు ఉంటారని, దాదాపుగా అదే సంఖ్యలో స్వతంత్ర, సహాయ హోదా అమాత్యులు ఉంటారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భారీ విజయంతో వరుసగా రెండోసారి అధికార పీఠం దక్కించుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని