
Yogi: మీరు ఎమ్మెల్యేకి కాదు.. సీఎంకు ఓటేస్తున్నారు: రోడ్ షోలో యోగి
దేహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని చంపావత్ నియోజకవర్గానికి ఈ నెల 31న జరిగే ఉప ఎన్నిక కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించారు. సీఎంగా పుష్కర్‌సింగ్ ధామి భవితవ్యాన్ని తేల్చే ఈ కీలక ఉప ఎన్నిక సందర్భంగా తనక్‌పూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో యోగి మాట్లాడారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ధామికి అనుకూలంగా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘మీరు కేవలం ఎమ్మెల్యేకు కాదు.. సీఎంకు ఓటేస్తున్నారు’ అన్నారు. 1997లో చంపావత్ జిల్లా అయ్యాక తొలిసారి ఓ సీఎంను ఎన్నుకొనే అవకాశం ఈ ప్రాంతానికి వచ్చిందన్నారు. ఆ అవకాశాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం పుష్కర్‌సింగ్ ధామి యువ నాయకత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ‘ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకొనే అవకాశం రావడం చంపావత్ అదృష్టం. ఉత్తరాఖండ్ అభివృద్ధి ప్రయాణాన్ని మీ ప్రాంతం ముందుండి నడిపించే అవకాశం ఇదే’ అన్నారు. అలాగే, సీఎం పుష్కర్‌సింగ్ ధామి కోసం తన సీటును త్యాగం చేసిన భాజపా నేత కైలాశ్ గెహ్టోరిని యోగి ప్రశంసించారు. ఈ రోడ్ షోలో సీఎం పుష్కర్‌సింగ్ ధామితో పాటు మాజీ ఎమ్మెల్యే గెహ్టోరీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌కు జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 47 స్థానాలు విజయఢంకా మోగించి భాజపా రెండోసారి అధికారం కైవశం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, గతంలో రెండుసార్లు ఖటిమా నియోజకవర్గం నుంచి గెలుపొందిన ముఖ్యమంత్రి ధామికి ఇక్కడ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. అయితే, పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఆయన చేసిన కృషిని గుర్తించిన అధిష్టానం ధామినే రెండోసారి సీఎంగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పుష్కర్‌సింగ్ ధామి ఆరు నెలల్లోపు శాసనసభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో సీఎం కోసం కైలాశ్ గెహ్టోరీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఈ నెల 31న ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Jasprit Bumrah: ధోనీనే స్ఫూర్తి.. బుమ్రా కూడా అతడి లాగే..!
-
India News
India Corona: అవే హెచ్చుతగ్గులు.. కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి..!
-
Business News
Stock Market Update: జులై నెలకు స్టాక్ మార్కెట్ల నష్టాల స్వాగతం
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20, వన్డేలకు.. టీమ్ఇండియా ఆటగాళ్ల ఎంపిక
-
Related-stories News
Sonu sood: కుమారుడి చికిత్స కోసం ఓ తల్లి తాపత్రయం.. సోనూసూద్ పేరుతో ఆన్లైన్ మోసం
-
Politics News
Shivsena: శివసేన ముందు ముళ్లబాట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- IND vs ENG: ఆఖరి సవాల్.. భారత్‌కు బుమ్రా సారథ్యం