YS Avinash Reddy: పులివెందుల నుంచి బయల్దేరిన ఎంపీ అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. పులివెందుల నుంచి హైదరాబాద్‌కు ఆయన బయల్దేరారు. 

Published : 17 Apr 2023 07:53 IST

పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నేడు సీబీఐ ముందు హాజరుకానున్నారు. కేసులో సహనిందితుడిగా చేర్చి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పులివెందుల నుంచి హైదరాబాద్‌కు ఆయన బయల్దేరారు. అవినాష్‌ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు భారీగా వైకాపా నేతలు బయల్దేరారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకానున్నారు.

ఇప్పటివరకు ఈ కేసులో అవినాష్‌రెడ్డిని హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో నాలుగుసార్లు విచారించినప్పుడు సాక్షిగానే వాంగ్మూలాలు నమోదు చేసింది. తాజాగా అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డిని ఆదివారం పులివెందులలో అరెస్టు చేసిన తర్వాత హైదరాబాద్‌లోని సీబీఐ జడ్జి నివాసంలో అధికారులు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భాస్కరరెడ్డి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో అవినాష్‌రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొన్నారు. హత్య తర్వాత సహనిందితులు డి.శివశంకర్‌రెడ్డి, టి.గంగిరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డితో కలిసి ఆధారాల్ని చెరిపివేయడంలో భాస్కరరెడ్డి కీలకపాత్ర పోషించారని అభియోగం మోపారు. దీంతో తొలిసారిగా అవినాష్‌రెడ్డి నిందితుల జాబితాలో ఉన్నట్లు బహిర్గతమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు