YS Jagan: ‘చేస్తామంటున్నారు కదా చూద్దాం..’ కొత్త ప్రభుత్వంపై వైకాపా నేతలతో జగన్‌

‘చేస్తామంటున్నారు కదా చూద్దాం.. ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చి చూద్దాం’.. కొత్త ప్రభుత్వంపై వైకాపా అధ్యక్షుడు జగన్‌ వ్యాఖ్యలివి. వైకాపా తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పలువురు అభ్యర్థులు, ఇతర నాయకులు మంగళవారం తాడేపల్లిలో జగన్‌ను కలిశారు.

Updated : 19 Jun 2024 08:05 IST

ఈనాడు, అమరావతి: ‘చేస్తామంటున్నారు కదా చూద్దాం.. ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చి చూద్దాం’.. కొత్త ప్రభుత్వంపై వైకాపా అధ్యక్షుడు జగన్‌ వ్యాఖ్యలివి. వైకాపా తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పలువురు అభ్యర్థులు, ఇతర నాయకులు మంగళవారం తాడేపల్లిలో జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఇలా వ్యాఖ్యానించారు. ‘సమన్వయంతో వ్యవహరిస్తూ కార్యకర్తలకు అండగా నిలవండి.. పార్టీపరంగా మద్దతు ఉంటుంది’ అని జగన్‌ వారికి చెప్పారు. ఈ ఎన్నికల్లో టికెట్‌ దక్కని తాజా మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పోటీ చేసి ఓటమి చెందిన కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పల నర్సయ్య, అప్పలనాయుడు, పొన్నాడ వెంకట సతీష్, సుధీర్, లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు బెల్లాన చంద్రశేఖర్, డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ తదితరులతోపాటు నందికొట్కూరు నియోజకవర్గ వైకాపా బాధ్యుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోట్ల హర్షవర్దన్‌రెడ్డి జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో తమకు ఎదురైన అనుభవాల గురించి వారు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని