YS Jagan: పులివెందులలో జగన్‌ విజయం.. గతంతో పోలిస్తే తగ్గిన ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో అధికార వైకాపాకు దిమ్మదిరిగే ఫలితాలు వచ్చాయి.

Published : 04 Jun 2024 16:27 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో అధికార వైకాపాకు దిమ్మదిరిగే ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ పులివెందులలో విజయం సాధించినా.. ఈసారి మెజార్టీ తగ్గడం గమనార్హం. సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి బీటెక్ రవిపై జగన్ 61,176 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఆయన ఆధిక్యం ఈసారి 28 వేల ఓట్ల మేరకు తగ్గింది. వైకాపా ప్రస్తుతం కేవలం నాలుగు స్థానాల్లో విజయం సాధించగా.. మరో ఐదింట్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇలాగే కొనసాగితే ప్రతిపక్ష హోదా దక్కడమూ కష్టమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని