YS Sharmila: టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్
టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించిన వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైతెపా శ్రేణులు ఆందోళనకు దిగాయి.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించిన వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైతెపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో షర్మిలతో పాటు ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
అంతకుముందు షర్మిల మాట్లాడుతూ పేపర్ లీకేజీ వ్యవహారంలో పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని.. చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ‘‘టీఎస్‌పీఎస్సీ ముందు ఆందోళన అంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బయటకు వెళ్లాలి అంటే ఇతర కారణాలు చూపించి నన్ను నిర్బంధిస్తున్నారు. నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులను మోహరించారు. నాకు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు.. లుక్ అవుట్ ఆర్డర్ ఇవ్వడానికి నేనేమైనా క్రిమినల్‌నా?’’ అని షర్మిల ప్రశ్నించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
తెదేపా ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి వైకాపా యత్నం.. భారీగా పోలీసుల మోహరింపు
-
India News
Orphan: అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
India News
Odisha Train Accident: పెను విషాదంలోనూ చేతివాటం..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
భార్య, అత్త, బావమరిదిని కోల్పోయాడు.. చివరి క్షణంలో ఆగి బతికిపోయాడు!
-
India News
సిగ్నలింగ్ వ్యవస్థలో తీవ్ర లోపాలు.. 3 నెలల క్రితమే హెచ్చరించిన రైల్వే ఉన్నతాధికారి