YS Sharmila: చంద్రబాబు, పవన్‌కు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ షర్మిల

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు.

Published : 12 Jun 2024 16:37 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆమె లేఖ విడుదల చేశారు. ‘‘ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మీ పాలన సాగాలి. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తూ శాంతిభద్రతలు కాపాడాలి. గడిచిన ఐదేళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి. పవన్‌ కల్యాణ్ సహా మంత్రులందరికీ శుభాకాంక్షలు’’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని