YS Sharmila: లోటస్‌పాండ్‌లోని నివాసంలో దీక్ష కొనసాగిస్తున్న షర్మిల

ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనకు నిరసగా వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నగరంలోని సైదాబాద్‌ పరిధి సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Updated : 16 Sep 2021 10:58 IST

హైదరాబాద్‌: ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనకు నిరసగా వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నగరంలోని సైదాబాద్‌ పరిధి సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. షర్మిల బుధవారం బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఈ ఘటనపై తెలంగాణ సీఎం స్పందించే వరకు కదిలేది లేదని అక్కడే దీక్షకు కూర్చున్నారు. దీంతో బుధవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు రంగప్రవేశం చేసి వైతెపా శ్రేణులను చెదరగొట్టి షర్మిల దీక్షను భగ్నం చేశారు. అనంతరం దీక్షాస్థలి నుంచి షర్మిలను లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసానికి తరలించారు. అయితే షర్మిల తన నివాసంలోనూ దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు దీక్ష ఆపేది లేదని ఆమె స్పష్టం చేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని