YS Sharmila: ప్రభుత్వానికి మానవత్వం లేదా?: వైఎస్‌షర్మిల

తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని వైఎస్సాఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

Updated : 27 Jan 2022 14:20 IST

హైదరాబాద్: తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని వైఎస్సాఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. వయసు పరిమితి లేకుండా రైతు బీమా పథకం అమలు చేయాలని కోరారు. కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదన్న షర్మిల.. కేసీఆర్‌ స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను తీర్చాలని ఆమె సీఎంకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా షర్మిల హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

‘‘రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? కేవలం రూ.25వేలు లోపు రుణం ఉన్న మూడు లక్షల మందికి మాత్రమే చేశారు. 36 లక్షల మందికి రైతులను తెరాస మోసం చేసింది. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలు అలాగే ఉన్నాయి. వాటికి అన్నదాతలే వడ్డీలు కడుతున్నారు.

ఇప్పటికే రుణాలు తీసుకున్నందు వల్ల రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తీర్చలేక ఒత్తిడితో అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదా?’’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని