YS Sharmila: వివేకా హత్య కేసు దర్యాప్తు.. షర్మిల కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. ఆ హత్య తన కుటుంబంలో జరిగిన ఘోరమని.. వివేకా కుమార్తె సునీతారెడ్డికి న్యాయం జరగాలన్నారు.

Updated : 21 Oct 2022 13:34 IST

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆమెను వివేకా హత్య కేసు దర్యాప్తుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మాట్లాడారు.

‘‘వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిది. ఆ హత్య నా కుటుంబంలో జరిగిన ఘోరం. వివేకా కుమార్తె సునీతారెడ్డికి న్యాయం జరగాలి. మా చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారనేది బయటకు రావాలి.. వాళ్లకి శిక్ష పడాలి. హత్య కేసు దర్యాప్తును ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదు. వివేకా హత్య కేసుకు రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయేమో అన్న అంశాలు సీబీఐ దర్యాప్తులో తేలిపోతాయి’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని