YS Sharmila : బండి సంజయ్, రేవంత్‌రెడ్డికి షర్మిల ఫోన్.. కలిసి పోరాడదామని పిలుపు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.
హైదరాబాద్ : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ అంశంపై కలిసి పోరాడదామని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని.. ప్రగతి భవన్‌కు మార్చ్ పిలుపునిద్దామని సూచించారు. ‘కేసీఅర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలి.కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరు’ అని షర్మిల అన్నారు.
ఉమ్మడిగా పోరాటం చేసేందుకు షర్మిలకు బండి సంజయ్ మద్దతు తెలిపి.. త్వరలో సమావేశం అవుదామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీనిపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Prakasam: ప్రకాశం జిల్లాలో దారుణం.. ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
-
Sports News
WTC Final: టీమ్ఇండియా ఆ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగొచ్చు: రికీ పాంటింగ్
-
India News
Viral: ఉద్యోగులు బయటికెళ్లకుండా ఆఫీసుకు తాళాలు.. వివాదంలో ఎడ్టెక్ కంపెనీ
-
Politics News
Congress: తెలంగాణ ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేసింది: కృష్ణ పూనియా
-
India News
Rujira Narula Banerjee: అభిషేక్ బెనర్జీ భార్యకు చుక్కెదురు.. విమానాశ్రయంలో అడ్డగింత
-
India News
China: భారత్ సరిహద్దుల్లో భారీగా చైనా నిర్మాణాలు: చాథమ్ హౌస్