Published : 09/06/2021 13:37 IST

YS Sharmila: ప్ర‌జ‌ల ఆశ‌యాలే పార్టీ సిద్ధాంతాలు: ష‌ర్మిల‌

హైద‌రాబాద్‌: ప్ర‌జ‌ల సంక్షేమం కోసం జులై 8న కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు వైఎస్ ష‌ర్మిల వెల్ల‌డించారు. హైదరాబాద్‌ లోట‌స్ పాండ్‌లో నూత‌న పార్టీ ఆవిర్భావ స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేసిన ష‌ర్మిల‌.. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు తెలుసుకోవాల‌ని సూచించారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌యాల‌కు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు రూపొందించ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు. పార్టీ ఎజెండాను ప్ర‌జ‌లే రాయాల‌ని.. ప్ర‌తిబిడ్డ ఒప్పుకొనేలా ఉండాల‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ‌ ఆలోచ‌న‌లు, అభిప్రాయాల‌ను 8374167039కి వాట్సాప్ చేయొచ్చ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

కొత్త‌గా పెట్ట‌బోయే పార్టీలో కార్య‌క‌ర్త‌లే కీల‌క‌మ‌ని.. వాళ్లు నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించ‌డానికి ప‌రిత‌పించాల‌న్నారు. షర్మిల ఏర్పాటు చేయనున్న పార్టీ పేరు ‘వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ’గా దాదాపు ఖ‌రారైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. 
 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని