YS Sharmila: నిరవధిక దీక్ష చేపట్టిన షర్మిల.. లోటస్‌పాండ్‌లో ఉద్రిక్తత

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆమె ఇంటి ఆవరణలోనే నిరవధిక దీక్షకు దిగారు. 

Updated : 09 Dec 2022 22:38 IST

హైదరాబాద్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆమె నిరవధిక దీక్షకు దిగారు. తొలుత హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి దీక్షకు కూర్చున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న సైఫాబాద్‌ పోలీసులు లోటస్‌పాండ్‌కు తరలించారు. లోటస్‌పాండ్‌ వద్ద రహదారిపైనే దీక్షకు దిగిన షర్మిలను పోలీసులు బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈక్రమంలో పోలీసులు, షర్మిలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఇంటి ఆవరణలోనే నిరవధిక దీక్షకు దిగిన షర్మిలకు మద్దతుగా ఆమె తల్లి విజయమ్మ కూడా దీక్షలో కూర్చున్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్నందునే  కేసీఆర్‌ సర్కారు తన పాదయాత్రను అడ్డుకుంటోందని షర్మిల ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని