YS Sharmila: టీఎస్‌పీఎస్సీ ముందు వైఎస్‌ షర్మిల ఆందోళన

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ

Updated : 15 Feb 2022 14:55 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు ఆమె ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1.9లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. షర్మిల బైఠాయించడంతో ఆ ప్రాంతంలో సుమారు గంటసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ఆమెతో పాటు వైతెపా కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. అంతకుముందు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డికి షర్మిల వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని