YS Sharmila: విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది: వైఎస్‌ షర్మిల

24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

Updated : 21 Jun 2024 19:57 IST

విజయవాడ: డాక్టర్లు అవుదామని ఆశపడిన 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా నీట్‌ పేపర్‌ లీక్‌ స్కామ్‌ జరిగిందనే ఆధారాలు బయటపడ్డాయన్నారు. నీట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ పిలుపుమేరకు విజయవాడలోని లెనిన్‌ కూడలిలో షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టారు. పరీక్షకు ఆలస్యంగా వస్తే గ్రేస్‌ మార్కులు ఎలా ఇస్తారు? రెండు నిమిషాలు అదనపు సమయం ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. అవకతవకలు జరిగినా ఎన్టీయే మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. భాజపా ప్రభుత్వాలు అధికారంలో ఉన్న బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే పేపర్‌ లీక్‌ అయిందన్నారు. ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని