YS vijayamma: విమర్శిస్తే బదులివ్వాలి.. దాడులు చేస్తారా?: వైఎస్‌ విజయమ్మ

వైతెపా అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆమె తల్లి వైఎస్‌ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమార్తెకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.

Updated : 29 Nov 2022 17:15 IST

హైదరాబాద్‌:  వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆమె తల్లి వైఎస్‌ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ‘‘నా కుమార్తెను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. చూసేందుకు వెళ్తుంటే నన్ను అడ్డుకున్నారు. ఇంటికే తీసుకొస్తామని పోలీసులు చెబుతున్నారు. తీసుకొచ్చే వరకు ఇంటి గేటు వద్దే కూర్చుంటా. నా కుమార్తె ఎక్కడా పరుష పదజాలం వాడలేదు. విమర్శిస్తే బదులివ్వాలి కానీ.. దాడులు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లంచుకోక తప్పదు. ప్రజల నుంచి షర్మిలను ఎవ్వరూ వేరు చేయలేరు. మహిళపై దాడి జరిగినప్పుడు ప్రతి నాయకుడు స్పందిస్తారు.. అందులో భాగంగానే బండి సంజయ్‌ స్పందించారు. నా కుమార్తెకు ఎప్పుడూ అండగా ఉంటా’’ అని విజయమ్మ స్పష్టం చేశారు.

ప్రగతిభవన్‌ ముట్టడికి  కారులో బయల్దేరిన వైఎస్‌ షర్మిలను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల డ్రైవింగ్‌ సీట్లో ఉండగానే కారును పోలీసు క్రేన్‌ వాహనంతో లిఫ్ట్‌ చేసి తరలించారు. పోలీసుల వైఖరిపై వైతెపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు