Andhra News: రణరంగమైన మాచర్ల.. రాళ్లు, గాజు సీసాలతో తెదేపా కార్యకర్తలపై దాడి
పల్నాడు జిల్లా మాచర్ల రణరంగమైంది. తెదేపా కార్యకర్తలు చేపట్టిన ర్యాలీపై వైకాపా శ్రేణులు కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో విరుచుకుపడ్డారు. దీంతో మాచర్ల పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
మాచర్ల: అధికారమే అండగా వైకాపా విధ్వంసానికి తెగబడింది. ఆ పార్టీ కార్యకర్తలు చేసిన విధ్వంసకాండలో పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం మంటల్లో చిక్కుకుంది. ఎటు చూసినా దాడులు, మంటలతో పట్టణంలో భయాందోళన నెలకొంది. దాదాపు 3గంటలకు పైగా సాగిన దమనకాండలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, నేతల వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.
తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడులు చేసిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ‘ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా తెదేపా కార్యకర్తలు స్థానిక రింగురోడ్డు నుంచి ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయం వద్ద వైకాపా శ్రేణులు కూడా భారీగా మోహరించారు. చిన్న కాన్వెంట్ వద్దకు తెదేపా ప్రదర్శన చేరుకోగానే వైకాపా శ్రేణులు ఒక్కసారిగా రాళ్లు, సీసాలు విసిరారు. తెదేపా శ్రేణులు ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు కర్రలతో దాడులకు దిగాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంత గొడవ జరుగుతున్నా పోలీసులు అక్కడికి రాలేదని తెదేపా నేతలు ఆరోపించారు. గొడవ ముగిసిన తర్వాత పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రదర్శన నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని తెదేపా మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు బలవంతంగా పంపించేశారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఇద్దరు వైకాపా కార్యకర్తలకు గాయాలు కావడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మాచర్ల తెదేపా కార్యాలయానికి నిప్పు
వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణ తర్వాత తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బ్రహ్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గుంటూరు తరలించారు. ఆ తర్వాత మాచర్లలో వైకాపా శ్రేణులు మరింత రెచ్చిపోయారు. మాచర్ల తెదేపా కార్యాలయానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. పలువురు తెదేపా నాయకుల కార్లకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. దీంతో మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా శ్రేణుల దాడిని తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాచర్ల హింసపై గుంటూరు డీఐజీకి ఫోన్ చేసి చంద్రబాబు మాట్లాడారు.
మాచర్లలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది: ఎస్పీ
మాచర్ల జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడారు. ‘‘వెల్దుర్తికి చెందిన నేరచరిత్ర గలవారు మాచర్లలో ఉంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా నిర్బంధ తనిఖీలు చేపట్టాం. ‘‘ఇదేమి ఖర్మ రాష్ట్రానికి’’ కార్యక్రమంలో పాల్గొన్న వారే దాడులు చేశారు. ఫ్యాక్షన్ చరిత్ర గల వ్యక్తులు సమీప ప్రత్యర్థులపై రాళ్లతో దాడులు చేశారు. ఫ్యాక్షన్‌కు సంబంధించిన గొడవకు రాజకీయరంగు పులిమే యత్నం ఇది. 20 నుంచి 30 ఏళ్లుగా ఫ్యాక్షన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటున్నాం. మాచర్లలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది’’ అని ఎస్పీ తెలిపారు.
ఆస్తుల విధ్వంసానికి తెదేపానే కారణం: ఎమ్మెల్యే పిన్నెల్లి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పల్నాడుపై పగపట్టిందన్నారు. చంద్రబాబు, లోకేశ్ కుట్రలో భాగంగానే మాచర్లలో మంటలు అని విమర్శించారు. ఫ్యాక్షన్ నేతను మాచర్లకు పంపి దాడులు చేయిస్తున్నారన్నారు. బ్రహ్మారెడ్డి ఇన్‌ఛార్జ్ అయ్యాక మాచర్లలో విధ్వంసాలు పెరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు. పల్నాడులో విధ్వంసానికి చంద్రబాబు, లోకేశ్‌దే బాధ్యత అని ఆయన విమర్శించారు. తెదేపా వాళ్లు రాజకీయ లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారన్నారు. కార్యక్రమం చేసే వారు కర్రలు, రాడ్లతో దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆస్తుల విధ్వంసానికి తెదేపానే కారణమన్నారు. దాడులకు సంబంధించి అన్ని వీడియోలు ఉన్నాయని పిన్నెల్లి తెలిపారు. విచారణ జరిపి పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Canada: కెనడాలో ఓ పెళ్లివేడుకలో పంజాబీ గ్యాంగ్‌స్టర్ హత్య..!
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్.. మండిపడ్డ సాక్షి మలిక్
-
Crime News
Kurnool: భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య
-
Sports News
Dhoni - CSK: ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్’ ధోనీకి వర్తించదట.. కారణం చెప్పిన సెహ్వాగ్!
-
India News
IAF: వాయుసేన అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్