Updated : 26 May 2022 13:44 IST

YSRCP Bus Yatra: మంత్రుల ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర ప్రారంభం

శ్రీకాకుళం: ఏపీలో సీఎం జగన్ సామాజిక విప్లవం సృష్టించారని.. ఇది దేశమంతా అవలంబించాలని మంత్రులు ఆకాంక్షించారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు సామాజిక న్యాయభేరి పేరిట శ్రీకాకుళం నుంచి నాలుగు రోజుల బస్సుయాత్రను ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న 17 మంది మంత్రులు తమ తమ సామాజిక వర్గాలకు వైకాపా ప్రభుత్వంలో దక్కిన ప్రాధాన్యాలను వివరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు.

‘‘వైకాపా ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో జమ చేస్తున్న నిధుల్లో 82శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వెళ్తోంది. పంచిపెట్టడం అనేది ఒక హేళన మాటగా మాట్లాడుతున్నారు. ఇది ప్రజలను కించపరచడమే. కులాల కార్పొరేషన్లకు నిధులు ఎంత ఇచ్చారనేది ముఖ్యం కాదని.. రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడం ముఖ్యం. దేశంలో మెజార్టీ వర్గాలైన కుల వృత్తుల వారికి రాజ్యాధికారం రావాలి. దానికి ఏపీయే నాంది అవుతుంది’’ అని ధర్మాన ప్రసాదరావు అన్నారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని