Kasu Mahesh Reddy: ఆ అవమానాలే చంద్రబాబులో కసిని పెంచాయి: వైకాపా మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి

ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీనికి కారణమన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆయన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

Updated : 23 Jun 2024 14:40 IST

గురజాల: ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీనికి కారణమన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆయన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

‘‘నాసిరకం మద్యం వైకాపా ఓటమికి కారణం. మద్యం తాగేవాళ్లు మాకు ఓటు వేయలేదు. ఆ పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకపోయింది. ఇసుక విధానం వల్ల పేదవర్గాలు తీవ్రంగా నష్టపోయారు. పార్టీలోని కొంతమంది నేతల నోటి దురుసు కూడా ఓటమికి కారణం. తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చి చంద్రబాబును బూతులు తిట్టారు. అలాంటి అవమానాలే చంద్రబాబుతో పాటు తెదేపా శ్రేణుల్లో కసిని పెంచాయి. ఎవరిని అవమానాలకు గురిచేసినా వారిలో కసి పెరిగి విజయం సాధిస్తారని చరిత్ర చెబుతోంది. మా ప్రభుత్వంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటాం’’ అని కాసు మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని