YSRCP: తెదేపా ఎమ్మెల్యేపై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు క్షమించండి.. వైకాపా నేత వేడుకోలు

నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై గతంలో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టినందుకు తనను క్షమించాలంటూ ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం కొత్తపల్లగిరి గ్రామానికి చెందిన వైకాపా వార్డు సభ్యుడు వేల్పుల జైహింద్‌ కోరాడు.

Updated : 24 Jun 2024 07:52 IST

క్షమాపణ కోరుతున్న జైహింద్‌

నందిగామ గ్రామీణం, నందిగామ, న్యూస్‌టుడే: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై గతంలో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టినందుకు తనను క్షమించాలంటూ ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం కొత్తపల్లగిరి గ్రామానికి చెందిన వైకాపా వార్డు సభ్యుడు వేల్పుల జైహింద్‌ కోరాడు. ఆడపిల్లలపై, సౌమ్యపై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు తాను, తన కుటుంబం బాధపడుతున్నాయని పేర్కొన్నాడు. ఈ మేరకు ఆదివారం ఆయన విడుదల చేసిన స్వీయ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తెలియక తాను వైకాపా నాయకుల వద్ద సోషల్‌మీడియా కార్యకర్తగా పనిచేసి అసభ్యకర పోస్టులు పెట్టానని, ఇకపై ఇలాంటి పోస్టులు పెట్టనని, క్షమించాలని మోకాళ్లపై కూర్చుని వేడుకున్నాడు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కలిసి తనను క్షమించాలని జైహింద్‌ ప్రాధేయపడినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని