పవన్‌ది పూటకో మాట: సజ్జల

స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించినట్లు చెప్పిన తెదేపా.. కొన్ని చోట్ల భాజపాకు లోపాయికారిగా సహాయపడుతోందని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు

Published : 07 Apr 2021 01:24 IST

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించినట్లు చెప్పిన తెదేపా.. కొన్ని చోట్ల భాజపాకు లోపాయికారిగా సహాయపడుతోందని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. భాజపా-జనసేన కూటమిలో చేరేందుకు తెదేపా పలు రకాలుగా ప్రయత్నాలు సాగిస్తోందని చెప్పారు. జగన్‌ను ఎదుర్కోలేక ఆ మూడు పార్టీలు జట్టు కట్టాలని భావిస్తున్నాయన్నారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. 

తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో ప్రతిపక్షాలన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తన సొంత అభిప్రాయాలు లేకుండా పూటకో మాట మాట్లాడతారని ఎద్దేవా చేశారు. తిరుపతిలో వైకాపా విజయం రిపీట్‌ అవుతుందని సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు. మెజారిటీ ఎంత అనేది తేలాల్సి ఉందని ధీమాగా చెప్పారు. వరుస సెలవుల వల్లే ఉద్యోగులకు నిర్ణీత తేదీల్లో జీతాలు ఇవ్వలేకపోయామని.. దీనిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని