Andhra News: సీఎంతో తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారు: వైకాపా ఎమ్మెల్యే ఆనం

సీఎం జగన్‌కు అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి ఆయనతో తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు.

Updated : 29 Apr 2022 14:57 IST

నెల్లూరు: సీఎం జగన్‌కు అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి ఆయనతో తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సాగునీటి సలహామండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో వెనుకబడ్డామని.. సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. సోమశిల కాలువలు సరిగా లేవని.. చివరి వరకు నీరు పోవడం లేదని చెప్పారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు.

కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రిగా వచ్చారని.. ఆయన అయినా మాట వింటారని అనుకుంటున్నామని ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మాటలను ఇక్కడి పాలకులు అబద్దాలు చేస్తున్నారని.. నెల్లూరు, సంగం వంతెనలు ప్రారంభిస్తామంటూ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. నీటిపారుదలశాఖ అధికారులు సీఎంవోకి వాస్తవాలు చెప్పాలన్నారు. మూడేళ్లుగా 20 శాతం కూడా చేయలేకపోతున్నారని.. పరువుపోతోందని ఆనం వ్యాఖ్యానించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు