Raghurama: నా గుండెలపై కూర్చొని విపరీతంగా కొట్టారు: రఘురామ

నిల్చొనే పరిస్థితి కూడా లేకుండా ఆనాడు తనకు కొట్టారని వైకాపా నర్సాపురం ఎంపీ రఘురామ అన్నారు. 

Updated : 15 May 2022 05:54 IST

దిల్లీ: నిల్చొనే పరిస్థితి కూడా లేకుండా ఆనాడు తనను కొట్టారని వైకాపా నర్సాపురం ఎంపీ రఘురామ అన్నారు. తన గుండెలపై కూర్చొని విపరీతంగా కొట్టారని చెప్పారు. దిల్లీలో రఘురామ మీడియాతో మాట్లాడారు. 

‘‘నా సెల్‌ఫోన్‌ కోసం వెతికి మళ్లీ నన్ను కొట్టారు. మొత్తం ఐదుసార్లు నన్ను తీవ్రంగా కొట్టారు. సీఎం జగన్‌, సునీల్‌ ఇద్దరూ అద్భుత కళాకారులు. ఓ కానిస్టేబుల్‌ వచ్చి ఏం జరిగింది.. ఎవరు కొట్టారని అమాయకంగా అడిగారు. హెడ్‌ కానిస్టేబుల్‌ వచ్చి నన్ను మంచంపై పడుకోబెట్టారు.

ఉన్మాది సంస్కృతిలో భాగంగానే నాపై దాడి చేశారు. ఇది నా 60వ పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజుల ఘనంగా జరుపుకొన్నా. 59వ పుట్టినరోజు ఘనంగా జరిపిన ఉన్మాదికి నా ధన్యవాదాలు. 2024లో ప్రజాక్షేత్రంలోనే ప్రజలు బుద్ధి చెబుతారు’’ అని రఘురామ అన్నారు.

మరోవైపు రఘురామకు ఫోన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ పర్యటన తర్వాత అమిత్‌షా తనను కలవనున్నట్లు రఘురామ వెల్లడించారు. గతేడాది ఇదే రోజు రఘురామను హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసింది. ప్రభుత్వ ప్రతిష్ఠకు ఎంపీ రఘురామ భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని సీఐడీ అభియోగం మోపిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని