MP Raghurama: అవును.. తెలంగాణ సిట్‌ నోటీసులు అందాయి: రఘురామ

‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తనకు తెలంగాణ సిట్‌ నోటీసులు అందాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు.

Updated : 25 Nov 2022 14:21 IST

దిల్లీ: ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తనకు తెలంగాణ సిట్‌ నోటీసులు అందాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. దిల్లీలోని తన నివాసంలో సిట్‌ నోటీసులు అందజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 29న బంజారాహిల్స్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించినట్లు చెప్పారు. 

దర్యాప్తులో భాగంగా ఎంపీ రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్‌ సేకరించినట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే ఆయనకు  41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లు నిందితులుగా ఉండగా..  భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి, బీడీజేఎస్‌ నేత తుషార్‌, కరీంనగర్‌ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌లను నిందితుల జాబితాలో సిట్‌ కొత్తగా చేర్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని