AP news : క్యాసినో వ్యవహారం వెనక ఉన్నదెవరు?: రఘురామ

కృష్ణా జిల్లా గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన ఓ ఫంక్షన్‌ హాల్‌లో క్యాసినో నిర్వహణ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీన్ని వదిలే ప్రసక్తే లేదని తెదేపా

Published : 23 Jan 2022 01:36 IST

దిల్లీ: కృష్ణాజిల్లా గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన ఓ ఫంక్షన్‌ హాల్‌లో క్యాసినో నిర్వహణ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీన్ని వదిలే ప్రసక్తే లేదని తెదేపా నియమించిన నిజనిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏలూరు డీఐజీ రేంజ్‌ కార్యాలయంలో కమిటీ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. గుడివాడ క్యాసినోతో మంత్రి కొడాలి నానికి సంబంధం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన్ని అన్యాయంగా ఇరికించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు? క్యాసినో డబ్బు ఎవరికి వెళ్లింది?తదితర విషయాలు తేటతెల్లం కావాల్సిన అవసరముందని చెప్పారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను లేవనెత్తారు.

పేర్ని నాని క్షమాపణలు చెప్పాలి 

ఇటీవల సినిమా టికెట్ల ధరలపై సీఎంతో చర్చించేందుకు వెళ్లిన సినీనటుడు చిరంజీవిపై మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని ఎంపీ రఘురామ డిమాండ్‌ చేశారు. తనపై అనర్హత వేటు వేయించలేమని వైకాపా ఒప్పుకుంటే తక్షణం రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. తమిళనాడు నుంచి తనకు రావాల్సిన డబ్బును సీఎం జగన్‌ నిలిపివేయించారని ఆరోపించారు. ఏపీ సీఐడీ తీరుపై ఇచ్చిన నోటీసుపై చర్య తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ని కోరినట్లు రఘురామ తెలిపారు.పీఆర్సీ ఆంశంపై స్పందిస్తూ.. ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తుతుందని,సంక్షేమం కంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రభుత్వ విధి అని రఘురామ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని