Ap News: ‘నన్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు పోరాడాలి’: వైకాపా ఎంపీ రఘురామ

రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

Updated : 13 Jan 2022 15:53 IST

దిల్లీ: రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీ నుంచి రఘురామ మీడియాతో మాట్లాడారు. ఉగ్యోగులు, భయపడుతున్న వైకాపా నేతలను మార్చుకోండని సీఎం జగన్‌కు సూచించారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడే వారిని తెచ్చుకోవాలన్నారు. క్షవరం అయిందని ఓటర్లకు రెండేళ్ల తర్వాత తెలిసిందన్నారు. ఉద్యోగులకు సీఎం జగన్‌ శఠగోపం పెట్టారని విమర్శించారు. క్షవరం అయితేగాని వివరం రాదనేలా ఉద్యోగ సంఘాల పరిస్థితి ఉందని.. అందరూ దివాళా తీసి కొంపలు అమ్ముకోవాలన్నట్లుగా ఉందన్నారు. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా.. అనేలా పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న పీఆర్‌సీ కొనసాగితే చాలు అనేలా ఉద్యోగులు భావిస్తున్నారని పేర్కొన్నారు. తనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు పోరాడాలని.. నియోజకవర్గ ప్రజలు తనను మళ్లీ గెలిపించాలని రఘురామ కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని