
Ap News: ఏపీ సీఐడీ పోలీసులకు ఎంపీ రఘురామ లేఖ
దిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హైదరాబాద్‌లోని నివాసంలో సంక్రాంతికి ముందు సీఐడీ అధికారులు రఘురామకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ రఘురామ సీఐడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దిల్లీ వెళ్లాక అనారోగ్యానికి గురయ్యానని.. విచారణకు హాజరయ్యేందుకు 4 వారాలు గడువు కావాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.