Andhra News: కాగ్‌ లెక్కలపై విచారణ చేపట్టాలి.. ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక స్థితిపై కాగ్‌ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని.. ఎస్‌ఎఫ్‌ఐవో లేదా సీబీఐ ఆర్థిక నేర విభాగంతో విచారణ జరిపించాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు

Updated : 29 Mar 2022 06:54 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక స్థితిపై కాగ్‌ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని.. ఎస్‌ఎఫ్‌ఐవో లేదా సీబీఐ ఆర్థిక నేర విభాగంతో విచారణ జరిపించాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి రఘురామ లేఖ రాశారు. బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి రూ.వేల కోట్లు ఎలా సేకరించారో విచారణ జరిపించాలని కోరారు. అప్పులు తీసుకునేటప్పుడు ఏపీ సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని లేఖలో ప్రస్తావించారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కూడా చేయించాలని విజ్ఞప్తి చేశారు. విచారణ వేళ సీఎం జగన్‌, అధికారులను ప్రశ్నించాలనే నిబంధన సైతం విధించాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు