Vijayasai Reddy: అంతా ఆయన వల్లే.. జైరాం రమేశ్‌పై ఎంపీ విజయసాయి విసుర్లు

కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌పై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఏపీ విభజన చట్టాన్ని ఆయన తప్పుల తడకగా రాయడం వల్లే ఎన్డీయే ప్రభుత్వం విభజన హామీలు

Published : 09 Aug 2022 01:44 IST

దిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌పై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఏపీ విభజన చట్టాన్ని ఆయన తప్పుల తడకగా రాయడం వల్లే ఎన్డీయే ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయడంలేదన్నారు.  ఒడిశాలోని గనుల శాఖ నుంచి రైల్వే శాఖకు బొగ్గు సరఫరా చేయకపోవడం వల్లే విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రెండు ఫర్నేస్‌లు మూతపడ్డాయన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ నా స్నేహితుడు జైరాం రమేశ్‌ ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని తప్పుల తడకగా రూపొందించారు. ‘Shall’ అని ఉండాల్సిన ప్రతీ చోటా ‘May’ అనే పదాన్ని ఉపయోగించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఎన్డీయే ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయడం లేదు. దురదృష్టవశాత్తు జైరాం రమేశ్‌ విస్మరించిన అంశాల వల్ల ఏపీ మూల్యం చెల్లించడానికి వీల్లేదు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలి’’ అని కేంద్రాన్ని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని