Budget 2022 : పెగాసస్‌ వ్యవహారం సామాన్య ప్రజల అంశమా?: విజయసాయిరెడ్డి

పెగాసస్‌ వ్యవహారం సామాన్య ప్రజల అంశం కాదని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో రాజ్యసభలోని వివిధ పక్షాల నేతలతో ఉపరాష్ట్రపతి

Published : 31 Jan 2022 21:34 IST

దిల్లీ: పెగాసస్‌ వ్యవహారం సామాన్య ప్రజల అంశం కాదని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో రాజ్యసభలోని వివిధ పక్షాల నేతలతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్‌గా  సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి వైకాపా పార్లమెంటరీపక్ష నేత విజయసాయిరెడ్డి హాజరయ్యారు. కేంద్రం చేపడుతున్న ఎల్‌ఐసీ, బీపీసీఎల్‌, ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కరోనా దృష్ట్యా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఐదేళ్లు పొడిగించాలని కోరారు. మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలని సూచించారు. తక్షణమే జనాభా లెక్కల సేకరణ చేపట్టాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో 10లక్షల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్రం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల ప్రధానికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశాలు అడ్డుకునే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని