Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే వైకాపా మద్దతు

రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential Election) ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై వైకాపా తన నిర్ణయం ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో......

Published : 24 Jun 2022 01:38 IST

అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential Election) ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై వైకాపా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమని ఆ పార్టీ పేర్కొంది. గడిచిన మూడేళ్లుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్ద పీట వేస్తున్న పార్టీగా ద్రౌపదీ ముర్మూకే మద్దతు తెలుపుతున్నట్టు పేర్కొంది. మంత్రివర్గ సమావేశం ఉన్నందున శుక్రవారం జరగబోయే ద్రౌపదీ ముర్మూ నామినేషన్‌ కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరు కావడంలేదని.. తమ పార్లమెంటరీ పార్టీ నేత, లోక్‌సభాపక్ష నేత హాజరవుతారని ఓ ప్రకటనలో వైకాపా వెల్లడించింది. మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని