Visakha Garjana: విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం.. ‘విశాఖ గర్జన’ ఏర్పాట్లు పరిశీలన

ఉమ్మడి విశాఖ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి.

Updated : 15 Oct 2022 10:36 IST

విశాఖ: ఉమ్మడి విశాఖ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పాయకరావుపేటలో తాండవ నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతవాసులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖ నగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంతోపాటు శివార్లలోనూ వర్షం పడుతోంది. మధురవాడ, ఆనందపురం, ఎండాడ, హనుమంతవాక, ఓల్డ్‌ డెయిరీ ఫామ్‌, గాజువాక, కూర్మన్నపాలెం, మల్కాపురం, సింధియా, జ్ఞానాపురం, పాతనగరం, అక్కయపాలెం, బీచ్‌రోడ్డు, మద్దిలపాలెం, ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

‘విశాఖ గర్జన’ ఏర్పాట్లు పరిశీలన..

మరోవైపు విశాఖలో రాజకీయేతర ఐకాస ‘విశాఖ గర్జన’ ర్యాలీని చేపట్టింది. అధికార వైకాపా సంపూర్ణ మద్దతులో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఈ ర్యాలీ మొదలై.. విశాఖ పార్క్‌ హోటల్‌ జంక్షన్‌కు చేరుకొని వైఎస్‌ విగ్రహం సమీపంలో సభ నిర్వహించనున్నారు. అయితే విశాఖలో నిన్న రాత్రి నుంచి కురుస్తోన్న వర్షం కారణంగా ర్యాలీ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఈ మేరకు ర్యాలీ ప్రారంభ వేదిక ఎల్‌ఐసీ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంత్రి అమర్నాథ్‌, అధికారులు పరిస్థితిని పరిశీలించారు. ర్యాలీ నేపథ్యంలో నగరంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని