YSRCP: వైకాపా గెలిచిన 11 అసెంబ్లీ స్థానాలు ఇవే..

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఘోర పరాజయం పాలైంది. 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది.

Updated : 04 Jun 2024 21:28 IST

అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఘోర పరాజయం పాలైంది. 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగిన ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల నియోజవకర్గంలో గతంలో కంటే జగన్‌కు మెజార్టీ తగ్గింది. జగన్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా వైకాపా కేబినెట్‌లోని మంత్రలంతా ఓటమి పాలయ్యారు.

వైకాపా గెలిచిన అసెంబ్లీ స్థానాలివే..

  • పులివెందుల: వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి
  • బద్వేలు: దాసరి సుధ
  • పుంగనూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • మంత్రాలయం: వె.బాలనాగిరెడ్డి
  • ఆలూరు: బూసినే విరూపాక్షి
  • యర్రగొండపాలెం (ఎస్సీ): తాటిపత్రి చంద్రశేఖర్‌
  • అరకు(ఎస్టీ): రేగం మత్స్యలింగం
  • పాడేరు (ఎస్టీ): మత్స్యరాస విశ్వేశ్వరరాజు
  • రాజంపేట: ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి
  • తంబళ్లపల్లి: పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి
  • దర్శి: బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని