Lokesh: రూ.లక్ష కోట్లున్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారు?: లోకేశ్‌

లక్ష కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు.

Published : 30 May 2023 19:22 IST

కడప: లక్ష కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనేదే తెదేపా లక్ష్యమన్నారు. నాలుగు రోజుల తర్వాత తిరిగి యువగళం పాదయాత్ర మొదలైంది. వైఎస్‌ఆర్‌ జిల్లాలో లోకేశ్‌ యాత్ర కొనసాగుతోంది.

పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. ‘‘ఎందరు పిల్లులుంటే అందరికీ అమ్మ ఒడి ఇస్తామన్నారు. ప్రస్తుతం అమ్మ ఒడి, జాబ్‌ క్యాలెండర్‌ ఊసే లేదు. మహిళలను ఏ ముఖం పెట్టుకొని సీఎం జగన్‌ ఓట్లు అడుగుతారు?విద్యుత్‌, గ్యాస్‌, పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు పెంచారు. వంద సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేసిన దేశంలోనే ఏకైక వ్యక్తి జగన్‌. బీసీ సోదరుల వెన్నెముక విరగొట్టారు. బీసీ రిజర్వేషన్లలో 10 శాతం కోతపెట్టారు. కోత పెట్టిన రిజర్వేషన్లను తిరిగి తీసుకువస్తాం. దామాషా ప్రకారం కార్పొరేషన్‌ ద్వారా రుణాలిప్పిస్తాం. బీసీలపై 26వేల దొంగ కేసులు పెట్టారు. తెదేపా అధికారంలోకి వచ్చాక బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఎస్సీలకు నిలిపివేసిన 27 సంక్షేమ కార్యక్రమాలను తిరిగి అమలు చేస్తాం. మైనార్టీల కోసం ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేస్తాం’’ అని లోకేశ్‌ వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని