Yuvagalam: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది.
అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈనెల 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేసిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల తర్వాత సెప్టెంబరు 29న రాత్రి 8.15 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, అక్టోబర్ 3న స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు లోకేశ్‌ని కోరారు.
కక్ష సాధింపుతో అనేక కేసులు తెరపైకి తీసుకొచ్చి పార్టీ అధినేత చంద్రబాబుని ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నందున దిల్లీలో న్యాయవాదులతో లోకేశ్ సంప్రదింపులు చేయాల్సిన అవసరముందని నేతలు అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నేతల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేశ్.. యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పున:ప్రారంభ తేదీని ప్రకటించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nara Lokesh: వంద రోజుల్లో.. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం
తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని, ఈ అంశంపై పవన్ కల్యాణ్ అన్నతో తొలి సమావేశంలోనే చర్చించామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. -
ఓట్ల కోసమే ‘నాగార్జునసాగర్’ వివాదం
ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని నాగార్జునసాగర్ వద్ద నీటి విడుదల అంశాన్ని వివాదాస్పదం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. -
‘విశాఖ ఉత్తరం’ అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుస్తామనే ధీమాతో సీఎం జగన్ ఉన్నారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. -
భాజపాను అధికారంలోకి రానివ్వం: బీవీ రాఘవులు
కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా భాజపాను అడ్డుకుంటామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తేల్చిచెప్పారు. -
ఎన్నికల్లో లబ్ధికోసమే నాటకాలు: రామకృష్ణ
తెలంగాణ ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ నీటి వివాదం పేరుతో కొత్త డ్రామాకు తెర తీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. -
నీటి కోసం దొంగ యుద్ధం: రఘురామ
తెలంగాణలో ఎన్నికలు జరిగే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటికోసం దొంగ యుద్ధం చేసేందుకు ప్రయత్నించిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
విశాఖను ఫైనాన్షియల్ హబ్‌గా ప్రకటించాలి: ధర్మాన
విశాఖను ఫైనాన్షియల్ హబ్‌గా ప్రకటించాలని, దీనికి అవసరమైన చర్యలను చేపట్టాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని కోరారు. -
నేడు తెదేపా పార్లమెంటరీ పార్టీ భేటీ
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం జరగనుంది. డిసెంబరు 4 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చించనున్నారు. -
రోడ్లను బురద గుంతల్లా మార్చినందుకు మళ్లీ జగన్ కావాలా?
రాష్ట్రంలోని రహదారుల్ని బురద గుంతల్లా మార్చినందుకు సీఎం జగన్ మళ్లీ కావాలా అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
బీసీల మధ్య చిచ్చు పెట్టడానికే ‘కులగణన’
బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికే సీఎం జగన్ కులగణనను తెరపైకి తెచ్చారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. -
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడమే పొన్నవోలు లక్ష్యం
తెదేపా అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, వ్యక్తిగతంగా ఆయన్ను పలచన చేయడమే లక్ష్యంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పని చేస్తున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
దేశమంతా రాజస్థాన్ తరహా ఆరోగ్య పథకం
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రారంభించిన ఆరోగ్య పథకం ఆదర్శప్రాయంగా ఉందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఈ పథకాన్ని అమలుచేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. -
5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు.. రూ.2 వేల కోట్ల విలువైన జప్తులు
దేశంలో శాసనసభ ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పలు సందర్భాల్లో కొరడా ఝళిపించింది. -
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో భాజపా ఓడితే.. గోవాలోని ప్రమోద్ సావంత్ సర్కార్ కుప్పకూలిపోతుందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు.