Andhra News: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవాలి: వైవీ సుబ్బారెడ్డి

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని ఉమ్మడి విశాఖజిల్లా సమన్వయ కర్త, తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి అన్నారు. పాదయాత్ర పేరుతో దండయాత్రకు వచ్చే వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

Published : 07 Oct 2022 01:26 IST

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని ఉమ్మడి విశాఖజిల్లా సమన్వయ కర్త, తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి అన్నారు. విశాఖను రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పాదయాత్ర పేరుతో దండయాత్రకు వచ్చే వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్తగా ఆడారి ఆనంద్‌కుమార్‌ నియమితులైన నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని సుబ్బారెడ్డి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్రపై దండయాత్రకు రావడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధి అంటే ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిలో మైలు రాయిగా ఉంటుందన్నారు. అమరావతినే రాజధానిగా నిర్మించాలంటే రూ.లక్షల కోట్లు కావాలని, ఇప్పుడున్న స్థితిలో అది సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నామని, పేదల సంక్షేమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరగాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యమని వివరించారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, అడారి ఆనంద్‌ కుమార్‌, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని