Bihar:ఎల్జేపీలో సంక్షోభానికి మేం కారణం కాదు: నీతీశ్‌

లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)లో చెలరేగిన అంతర్గత కలహాలకు తాను కారణం కాదని బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. తన పార్టీకి కూడా ఇందులో ప్రమేయం లేదన్నారు.

Published : 23 Jun 2021 01:19 IST

దిల్లీ: లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)లో చెలరేగిన అంతర్గత కలహాలకు తాను కారణం కాదని బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. తన పార్టీకి కూడా ఇందులో ప్రమేయం లేదన్నారు. వ్యక్తిగత వ్యవహారాల నిమిత్తం దిల్లీ వెళ్లిన సందర్భంగా మంగళవారం నీతీశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎల్జేపీలో తలెత్తిన విభేదాలకు నీతీశ్‌ కుమార్‌ కారణమంటూ ఇటీవల ఆ పార్టీ నేత చిరాగ్‌ పాసవాన్‌ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. పార్టీలో ఆధిపత్యం కోసం చిరాగ్‌, పశుపతి కుమార్‌ పారస్‌ చేసిన వర్గ రాజకీయాలే తాజా పరిణామాలకు కారణమన్నారు. అది వారి అంతర్గత విషయమని.. దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజల్లో సానుభూతి కోసమే చిరాగ్‌ తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల పశుపతి కుమార్‌ పారస్‌.. నలుగురు ఎంపీలతో కలిసి చిరాగ్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరుకు చిరాగ్‌ ప్రస్తుతం ఫలితం అనుభవిస్తున్నారని నీతీశ్‌ విమర్శించారు. తన పార్టీ నేతలను ఐక్యంగా ఉంచడంలో విఫలమయ్యారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని