Prince Charles: ఖతర్‌ నుంచి నగదు రూపంలో విరాళాలు తీసుకున్న ప్రిన్స్‌ ఛార్లెస్‌

బ్రిటన్‌ యువరాజు ఛార్లెస్‌ గతంలో 30 లక్షల యూరోల (సుమారు రూ.24.79 కోట్లు) మేర విరాళాలను ఖతర్‌ నుంచి నగదు రూపంలో సూట్‌కేసులో స్వీకరించారని ‘ది సండే టైమ్స్‌’ ఒక కథనం వెలువరించింది. ఖతర్‌ మాజీ ప్రధాని

Updated : 27 Jun 2022 09:43 IST

లండన్‌: బ్రిటన్‌ యువరాజు ఛార్లెస్‌ గతంలో 30 లక్షల యూరోల (సుమారు రూ.24.79 కోట్లు) మేర విరాళాలను ఖతర్‌ నుంచి నగదు రూపంలో సూట్‌కేసులో స్వీకరించారని ‘ది సండే టైమ్స్‌’ ఒక కథనం వెలువరించింది. ఖతర్‌ మాజీ ప్రధాని షేక్‌ హమద్‌ బిన్‌జసిమ్‌ బిన్‌ జబెర్‌ అల్‌థానీ నుంచి నోట్ల కట్టలుగా ఈ మొత్తాన్ని ఛార్లెస్‌ తీసుకున్నట్లు తెలిపింది. మూడు విడతలుగా ఈ మొత్తం ‘ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ఛారిటబుల్‌ ఫండ్‌’ (పీడబ్ల్యూసీఎఫ్‌)లో జమ అయిందనీ, రాజ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారి ప్రాజెక్టులకు దీని నుంచి గ్రాంటు అందుతుంటుందని వివరించింది. ఈ చెల్లింపులు అక్రమమని మాత్రం కథనం పేర్కొనలేదు. దాత ఇష్టం మేరకు నగదు రూపంలో విరాళాన్ని తీసుకున్నట్లు పీడబ్ల్యూసీఎఫ్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని