Gujarat: భూమి నుంచి అగ్నిజ్వాలలు.. ఏళ్లుగా ఆరని అఖండ జ్యోతులు
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా, జగతియా గ్రామంలో భూమిలో నుంచి అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. భూగర్భం నుంచి గ్యాస్ పైప్‌లైన్ వేశారేమో? అని అనుకునేంతలా నిరంతరం మంటలు రగులుతూనే ఉన్నాయి. గ్రామంలోని మాతా హర్సిద్ధి మందిరంలో ఈ అఖండ జ్యోతి ఉండడంతో ప్రజలు భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. ఆలయంలో మొత్తం మూడు అఖండ జ్యోతులు వెలుగుతున్నాయి. రెండు జ్యోతులు ప్రత్యేకంగా ఓ గదిలో ఉండగా.. ఒకటి గుడి ఆవరణలో ఉంది. భక్తులు ఆహారం వండుకోవడానికి, ఏవైనా ప్రయోగాలు చేయడానికి బయటి జ్యోతిని వినియోగిస్తున్నారు. ఈ మంటపై వండిన ఆహారం తింటే రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. లోపల ఉన్న రెండు అఖండ జ్యోతులు.. ఎలాంటి అంతరాయం లేకుండా వెలుగుతున్నాయి. ఈ మంటలు ఎప్పుడు ప్రారంభమయ్యాయనే విషయమై స్పష్టత లేదు. చాలా ఏళ్ల నుంచి ఇవి వెలుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. జగతియా గ్రామంలో గ్యాస్ ఎందుకు బయటకు వస్తోందనే విషయాన్ని తెలుసుకునేందుకు గతంలో పరిశోధనలు జరిగాయి. 1921లో కెప్టెన్ పాల్మెర్.. ఇక్కడ దర్యాప్తు నిర్వహించారు. గ్యాస్‌ని వెలికితీసేందుకు తవ్వకాలు జరిపారు. అయితే.. మంటలకు కారణం ఏమిటన్న విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు. 1970లలో ఓఎన్జీసీ సైతం ఈ ప్రాంతంపై దృష్టిసారించింది. గ్యాస్ లీక్‌పై పరిశోధన చేపట్టింది. అందులోనూ ఎలాంటి విషయం వెల్లడవలేదు. ఫలితంగా, స్థానికుల్లో ఈ మంటల పట్ల భక్తిభావం మరింత పెరిగింది.
ఈ జ్వాలల చుట్టూ కొన్ని కథలు కూడా అల్లుకున్నాయి. గుజరాతీ వ్యాపారి, మానవతావాది అయిన సేఠ్ జగదూష.. జగతియా గ్రామానికి దగ్గర్లో ఉన్న కోడినార్లో జన్మించారు. భారతంలోని కర్ణుడే పునర్జన్మ సాధించి జగదూషగా వచ్చాడని ఇక్కడివారు నమ్ముతుంటారు. ‘‘కర్ణుడు తన జీవితంలో అనేక దానధర్మాలు చేసినా.. ఆహారాన్ని మాత్రం దానం చేసేవాడు కాదు. అందుకే స్వర్గానికి వెళ్లిన తర్వాత కర్ణుడికి ఆహారం లభించలేదు’’ అని కథ ప్రచారంలో ఉంది. సేఠ్ జగదూషలా కర్ణుడు జన్మించిన తర్వాత.. స్థానికంగా పంటలు బాగా పండాయని కథలుగా చెబుతారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: కేంద్రం నిర్ణయం చేనేత పరిశ్రమకు మరణశాసనమే: కేటీఆర్
-
Sports News
INDw vs AUSw : అమ్మాయిలూ... ప్రతీకారం తీర్చుకోవాలి.. పసిడి పట్టేయాలి!
-
India News
ISRO: SSLV ప్రయోగం అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు..
-
Sports News
CWG 2022: పురుషుల ట్రిపుల్ జంప్‌లో భారత్‌కు స్వర్ణం-రజతం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Pooja Hegde: ‘సీతారామం’ హిట్.. ‘పాపం పూజా’ అంటోన్న నెటిజన్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- సూర్య అనే నేను...
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం